- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India vs Pakistan: ఉత్కంఠ పోరు షురూ.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్
టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 వరల్డ్‌కప్‌లో అసలైన మజా మొదలైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగా పోరులో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
టీమిండియాలో మార్పులు!
ఈ కీలక మ్యాచ్ కోసం భారత జట్టు మేనేజ్‌మెంట్ రెండు కీలక మార్పులు చేసినట్లు తెలిసింది. యువ హిట్టర్ అభిషేక్ శర్మ, స్పిన్ మాంత్రికుడు కుల్‌దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్‌ల్లో ఆడిన సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌లను ఈ మ్యాచ్ కోసం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ రాకతో బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కాగా, కొలంబో స్పిన్ ట్రాక్‌పై కుల్‌దీప్ యాదవ్ కీలకం కానున్నాడు.
వరుణుడి ముప్పు లేదు!
క్రికెట్ ప్రేమికులకు మరో ఊరటనిచ్చే అంశం వాతావరణం. గత కొన్ని రోజులుగా కొలంబోలో వర్ష సూచన ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆకాశం నిర్మలంగా ఉంది. ప్రస్తుతం మబ్బులు వీడిపోవడంతో మ్యాచ్‌కు వర్షం ముప్పు దాదాపు తొలగిపోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు.






