- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంత దరిద్రంగా ఆడతారా ? ఆస్ట్రేలియా ఎలిమినేషన్ పై పాంటింగ్ సంచలనం!
గాయాల కారణంగా టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా ఎలిమినేషన్ అయిందని రికీ పాంటింగ్ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా జట్టు ( Australia cricket team) ఒకప్పుడు కింగ్ లా ఉండేది. ఇప్పుడు ఏమో జింబాబ్వే లాంటి చిన్న జట్లపైన కూడా ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంది. ఆస్ట్రేలియాను పసికూనలు కూడా అలవోకగా ఓడించేస్తున్నాయి. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టును ప్రస్తుతం ప్లేయర్ల గాయాలు సతమతం చేస్తున్నాయి. వాటికి తోడు చాలా మంది ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఫామ్ లో లేరన్న సంగతి తెలిసిందే. దీని వల్ల టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు ఘోర పరాభవాన్ని చవి చూసింది. జింబాబ్వే లాంటి చిన్న టీం చేతిలో కూడా ఆస్ట్రేలియా ఓడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ నుంచి ఎలిమినేట్ అయింది కంగారు జట్టు.
కంగారు జట్టుపై రికీ పాంటింగ్ సీరియస్ !
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ నుంచి ఆస్ట్రేలియా ఎలిమినేట్ కావడంపై ఆ జట్టుకు సంబంధించిన మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ( Ricky Ponting) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత దరిద్రంగా తమ జట్టు ఆడుతుందని అసలు ఊహించలేదని వెల్లడించారు. గ్రూప్ స్టేజ్ లోనే ఆస్ట్రేలియా ఎలిమినేట్ కావడం దారుణమన్నారు. కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా లాంటి భయంకరమైన జట్టు సూపర్ 8 స్టేజ్ దాకా వెళ్లకపోవడం అత్యంత దురదృష్టం అన్నారు. ఆస్ట్రేలియా జట్టులో సీనియర్ ప్లేయర్లు గాయాల బారిన పడ్డారని వ్యాఖ్యానించారు.
దీని వల్ల టోర్నమెంటులో సరిగ్గా ఆస్ట్రేలియా పర్ఫామెన్స్ ఇవ్వలేదని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించారు. సీనియర్ ప్లేయర్లు లేకున్నా ఉన్న ప్లేయర్లు కాస్త మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేదని సూచనలు చేశారు. వాళ్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడలేదని ఫైర్ అయ్యారు. తుది జట్టులో సెలెక్ట్ అయిన ప్లేయర్లు కాస్త ఆచితూచి ఆడి ఉంటే, ఆస్ట్రేలియా పరిస్థితి ఇప్పుడు వేరే లాగా ఉండేదని వ్యాఖ్యానించారు రికీ పాంటింగ్. టీ20 వరల్డ్ కప్ లో ఆశించిన రీతిలో ఆస్ట్రేలియా ఎక్కడ కూడా ఆడలేదని గుర్తు చేశారు. ఇక లీగ్ దశలో చివరి మ్యాచ్ అయిన గెలవాలని కోరారు. ఆస్ట్రేలియా ( Australia) బౌన్స్ బ్యాక్ అవుతుందని, ఆ నమ్మకం తనకు ఉందని వెల్లడించారు. దీంతో రికీ పాంటింగ్ ( ponting) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా, టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో భాగంగా మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరుగాల్సి ఉంది. కానీ వర్షం విపరీతంగా పడిన నేపథ్యంలో జింబ్వాబ్వే ( Zimbabwe), ఐర్లాండ్ ( Ireland) జట్లకు చెరో పాయింట్ దక్కింది. దీంతో ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది. జింబాబ్వే మాత్రం సూపర్ 8 లోకి దూసుకెళ్లి, సరికొత్త చరిత్ర సృష్టించింది.






