- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రికెటర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్
మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధాన్ని రద్దు చేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్.. బేషరతు క్షమాపణలు చెప్పడంతో బోర్డు కీలక నిర్ణయం!

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ అంతర్జాతీయ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ (S Sreesanth) కు కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషల్ మీడియా, విజువల్ మీడియా వేదికగా అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గత ఏడాది ఆయనపై మూడేళ్ల నిషేధం విధించింది. కాగా అతనిపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని కేరళ క్రికెట్ అసోసియేషన్ బుధవారం (జులై 1, 2026) రద్దు చేసింది. కేసీఏ ప్రత్యేక సాధారణ నిడివి సమావేశంలో (Special General Body Meeting) శ్రీశాంత్ సమర్పించిన అధికారిక, బేషరతు క్షమాపణ పత్రాన్ని (Unconditional Apology) సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అసోసియేషన్ ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూనే, ప్రస్తుతానికి నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో కేరళ క్రికెట్ లీగ్ (KCL) సీజన్-3 లో 'ఏరీస్ కొల్లాం సేలర్స్' (Aries Kollam Sailors) ఫ్రాంచైజీకి కో-ఓనర్‌గా శ్రీశాంత్ తన సేవలను కొనసాగించేందుకు మార్గం సుగమం అయింది.






