- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెలవకుంటే ఇంటికే.. భారత్ A బ్యాటర్ల విజృంభణ: ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’ కు భారీ లక్ష్యం
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ‘ఏ’ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ‘ఏ’ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. బుధవారం ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’తో జరుగుతున్న కీలక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ముగ్గురు హాఫ్ సెంచరీలు:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ముగ్గురు బ్యాటర్లు అర్ధశతకాలతో కదంతొక్కారు. కెప్టెన్ తిలక్ వర్మ (59), ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (58), కుమార్ కుషాగ్ర (58) అద్భుతంగా ఆడి జట్టుకు భారీ స్కోరును అందించారు. ఆరంభంలో క్యాచ్ ఔట్ ప్రమాదం (బంతి నేలకు తాకడంతో నాటౌట్‌గా తేలింది) నుంచి బయటపడిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (38) పర్వాలేదనిపించాడు. మిగతా వారిలో రుతురాజ్ గైక్వాడ్ (30), విప్రాజ్ నిగమ్ (30), నిషాంత్ సింధు (21 నాటౌట్) చివర్లో విలువైన పరుగులు జోడించారు. సూర్యాంశ్ షెడ్జే (7) త్వరగానే పెవిలియన్ చేరాడు. అఫ్ఘాన్ బౌలర్లలో ఫరిదూన్, అబ్దుల్లా, ఫర్మనుల్లా తలో రెండు వికెట్లు పడగొట్టగా, జహీర్‌ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
గెలవకుంటే ఇంటికే..
భారత జట్టుకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది. గతంలో అప్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏకంగా 349 పరుగులు చేసినప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో దురదృష్టవశాత్తూ ఓటమి పాలైంది. ఆ తర్వాత శ్రీలంక ‘ఏ’ తో జరిగిన మ్యాచ్‌లోనూ సూపర్ ఓవర్లో పరాజయం చవిచూసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన భారత్.. టోర్నీలో నిలవాలంటే అఫ్ఘాన్ విధించిన ఈ 320 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాల్సిందే.






