నా త‌ప్పిదం వ‌ల్లే, ఓడిపోయాం..త‌ప్పు ఒప్పుకున్న‌ హ్యారీ బ్రూక్

by velandi.Saikiran |

సంజు క్యాచ్ వ‌దిలేయ‌డంతో త‌మ జ‌ట్టు ఓడిపోయింద‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.

నా త‌ప్పిదం వ‌ల్లే, ఓడిపోయాం..త‌ప్పు ఒప్పుకున్న‌ హ్యారీ బ్రూక్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో భారత్ చేతిలో ఓడిపోవడంపై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పందించారు. తన తప్పిదం వల్లే ఈ మ్యాచ్ ఓడిపోయామని ఎమోషనల్ అయ్యారు. భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడినట్లు మ్యాచ్ పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్ లో వెల్లడించారు హ్యారీ బ్రూక్. భారత ఓపెనర్ సంజు శాంసన్ క్యాచ్ వదిలివేయడం తాను చేసిన అతి పెద్ద తప్పిదమని రియలైజ్ అయ్యారు. అదే తమ ఓటమికి కారణమైందని ఎమోషనల్ అయ్యారు హ్యారీ బ్రూక్. ఇక తమ జట్టు కుర్రాడు జాకబ్ బెథెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినట్లు కొనియాడాడు.

అతను ఎంతటి గొప్ప ఆటగాడు మరోసారి ప్రపంచానికి తెలిసిందని.. తన సత్తాను అందరికీ చూపించాడని వెల్లడించారు. 250 పరుగుల భారీ లక్ష్యం ఉన్నప్పటికీ, తమ జట్టు చివరి వరకు పోరాడిందని స్పష్టం చేశారు. మేము ఓడిపోయినప్పటికీ, తమ జట్టు చూపించిన ధైర్యం చూసి గర్వపడుతున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హ్యారీ బ్రూక్. ఇది ఇలా ఉండగా భారత బ్యాటింగ్ సమయంలో సంజు ఇచ్చిన సింపుల్ క్యాచ్ ను నేలపాలు చేశాడు హ్యారీ బ్రూక్. దీంతో ఈ మ్యాచ్ లో సంజు చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు, ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఇక మార్చి 8వ తేదీన న్యూజిలాండ్, భారత్ మధ్య ఫైనల్ ఉంటుంది.

Next Story