సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్మృతి.. ఏం జరిగింది?

by Naga Rani Yarlagadda |

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ ల పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉండగా..

సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్మృతి.. ఏం జరిగింది?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ ల పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉండగా.. ఆమె తండ్రి అనారోగ్యానికి గురికావడంతో పెళ్లిని వాయిదా వేశారు. కాసేపటికే పలాశ్ కూడా అనారోగ్యానికి గురైనట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్మృతి మంధాన ఇన్ స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్, సంగీత్ ల వీడియోలు, ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో వీరి పెళ్లి కేవలం వాయిదా పడిందా? లేక మొత్తానికే ఆగిపోయిందా? అన్న సందేహాలు వస్తున్నాయి.

అనారోగ్య కారణాలతో పెళ్లి వాయిదా పడితే ఫొటోలు, వీడియోలను ఎందుకు డిలీట్ చేసిందని ఆమె అభిమానులు, నెటిజన్లలో చర్చ మొదలైంది. కొందరైతే పెళ్లయ్యాక విడిపోయే కంటే ఇదే బెటరంటూ తమ అభిప్రాయాలను చెప్తున్నారు.

కాగా.. పెళ్లి ఆగిపోవడంతో పలాష్ చాలా ఒత్తిడికి గురయ్యాడని, అందుకే అనారోగ్యానికి గురయ్యాడని అతని తల్లి అమితా ముచ్చల్ వెల్లడించారు. స్మృతి తండ్రితో పలాష్ కు ఎనలేని అనుబంధం ఉందని, అందుకే ఆయన పూర్తిగా కోలుకునేంత వరకూ పెళ్లి పనులు కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాడని చెప్పారు. స్మృతి కూడా ఈ పరిస్థితితో మానసికంగా కుంగిపోయిందన్నారు.

Next Story