రెండో టెస్ట్ కు ముందే టీమిండియా మ‌రో షాక్‌..!

by velandi.Saikiran |

రెండో టెస్టులో 50% మాత్రమే గిల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు గిల్ కు రెస్ట్ ఇస్తారని చెబుతున్నారు. ఒక‌వేళ గిల్

రెండో టెస్ట్ కు ముందే టీమిండియా మ‌రో షాక్‌..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు ఊహించని ఎదుటి దెబ్బ తగిలింది. మొదటి టెస్ట్ సందర్భంగా కెప్టెన్ గిల్ , మెడ నొప్పి బారిన పడ్డాడు. దీంతో ఆసుపత్రి పాలయ్యాడు గిల్. సోమవారం రోజున ఉదయం ఆసుపత్రి నుంచి గిల్ డిశ్చార్జ్ అయి, టీమిండియా బస చేస్తున్న హోటల్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియాకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. కోల్‌క‌త్తా నుంచి టీమిండియా బుధవారం లేదా గురువారం గౌహతి వెళ్ళనుంది. రెండో టెస్టు గౌహతి వేదికగా జరగనున్న నేపథ్యంలో టీమిండియా పయనం కానుంది. అయితే ఆ సమయంలో టీమిండియాతో పాటు గిల్ కూడా ప్రయాణిస్తాడని తెలుస్తోంది. కానీ మ్యాచ్ మాత్రం ఆడటం కష్టమే అని అంటున్నారు. రెండో టెస్టులో 50% మాత్రమే గిల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు గిల్ కు రెస్ట్ ఇస్తారని చెబుతున్నారు. ఒక‌వేళ గిల్ ఆడ‌క‌పోతే, సాయి సుద‌ర్శ‌న్ రంగంలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి.

Next Story