- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీలంకతో సఫారీల సిరీస్ వాయిదా..
by Shyam |
<p>కరోనా వైరస్ ప్రభావంతో మరో క్రికెట్ సిరీస్ వాయిదా పడింది. రోజులు గడుస్తున్నా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో తమ శ్రీలంక పర్యటనను వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ఒక మీడియా నోట్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం దక్షిణాఫ్రికా జట్టు జూన్‌లో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడాల్సి ఉంది. కానీ, పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉండటంతో సిరీస్ వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. ఇప్పటికే భారత్‌తో సిరీస్ అర్థాంతరంగా రద్దు […]</p>

X
కరోనా వైరస్ ప్రభావంతో మరో క్రికెట్ సిరీస్ వాయిదా పడింది. రోజులు గడుస్తున్నా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో తమ శ్రీలంక పర్యటనను వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ఒక మీడియా నోట్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం దక్షిణాఫ్రికా జట్టు జూన్‌లో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడాల్సి ఉంది. కానీ, పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉండటంతో సిరీస్ వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. ఇప్పటికే భారత్‌తో సిరీస్ అర్థాంతరంగా రద్దు కాగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కరోనా ప్రభావం తగ్గేంత వరకు ఎలాంటి క్రికెట్ ఆడబోమని సఫారీ బోర్డు స్పష్టం చేసింది.
Tags : South Africa, Srilanka, Corona, Cricket series, Postponed
Next Story






