#RC 15 క్రేజీ న్యూస్.. ముఖ్యమంత్రిగా రామ్ చరణ్ తేజ్?

by  |
ramcharan, shankar
X

దిశ, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లెజెండరీ డైరెక్టర్ రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తూనే, మరోవైపు కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్నాడు. దీని తర్వాత ఇండియన్ స్పీల్‌బర్గ్ డైరెక్టర్ శంకర్‌తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంలో చరణ్ రోల్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కే శంకర్ సినిమాల్లో సోషల్ మెసేజ్ తప్పకుండా ఉంటుంది. గతంలో ‘ఒకే ఒక్కడు’ సినిమా ద్వారా ఒక్క రోజు ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్‌ను తెరమీద అద్భుతంగా ఆవిష్కరించిన శంకర్.. అలాంటి యూనిక్ థాట్‌తో రామ్ చరణ్ తేజ్‌ను ముఖ్యమంత్రిగా చూపించనున్నారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ఏ జోనర్‌లో ఉండబోతుంది? అనే విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తూనే ఉంటాయి.

Next Story