- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్రయత్నాలు ప్రధాని చేయడం దుర్మార్గం
<p>దిశ, నల్లగొండ: దేశంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేస్తున్నదని యాదాద్రి భువనగిరి జిల్లా ఐద్వా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు. రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గురువారం దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా భువనగిరి రైల్వే స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ కబంధహస్తాల్లో […]</p>

దిశ, నల్లగొండ: దేశంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేస్తున్నదని యాదాద్రి భువనగిరి జిల్లా ఐద్వా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు. రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గురువారం దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా భువనగిరి రైల్వే స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ కబంధహస్తాల్లో పాలన సాగిస్తోందన్నారు. పేదలు, సామాన్యులకు అందుబాటులో ఉన్న రైల్వేను అంబానీ, ఆధానిలకు కట్టబెట్టి లాభాలార్జించే ప్రయత్నాలు ప్రధాని మోదీ చేయడం దుర్మార్గమన్నారు. కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సాయం చేయలేని కేంద్రం ప్రభుత్వం.. ప్రజలకు అందుబాటులో ఉన్న సేవారంగాలను అమ్ముకోవడం ప్రభుత్వ పాలన తీరుకు నిదర్శనమని తెలిపారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు.






