భవిష్యత్ అంతా మాదే: తమ్మినేని వీరభద్రం

121
Chada-venkat

దిశ, అంబర్ పేట్: దేశ రాజకీయాల్లో బీజేపీ పార్టీ విధానాలకు కాలం చెల్లిందని, మోడీ సర్కార్ కు వ్యతిరేకత మొదలైందని, భవిష్యత్ అంతా ఎర్ర జెండాదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం నాయకులు ఎం. దశరథ్, వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం హైదరాబాద్ సెంట్రల్ సిటీ 22వ మహాసభలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పోరాటం చేసింది కమ్యూనిస్టు మాత్రమే అని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రమాదం ఏర్పడిందని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైతుల వీరోచిత పోరాటం వల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహారావు, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి శ్రీనివాస్, ఎం. శ్రీనివాసరావు, రాజన్న అరుణ జ్యోతి, నగర మాజీ కార్యదర్శి పీఎస్ఎన్ మూర్తి, రఘుపాల్ పాల్గొన్నారు.