ఇక పోరాటానికి సిద్ధం కండి.. సీపీఎం పిలుపు

by Shyam |

<p>దిశ, చండూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలోని నాంపల్లి మండల మహాసభలో పాల్గొని మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్నా.. సంపద మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి దేశ సంపదను [&hellip;]</p>

CPM leader Sudhakar Reddy
X

దిశ, చండూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలోని నాంపల్లి మండల మహాసభలో పాల్గొని మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్నా.. సంపద మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని విమర్శించారు. అంతేగాకుండా.. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక కార్డులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నించే గొంతులను అణిచి వేసేందుకు ఉపా, రాజద్రోహం వంటి నిర్బంధ చట్టాలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం మాయమాటలతో పిట్టల దొరలా కాలం గడుపుతున్నాడని విమర్శించారు. ఈ మహాసభ వాసిపాక ముత్తిలింగం, ఇరిగి అలివేలు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, మండల కమిటీ సభ్యులు కొమ్ము లక్ష్మయ్య, నాంపల్లి రమణ, గడ్డం గురుమూర్తి, చెట్టుపల్లి నాగభూషణ్, ఇరిగి వెంకన్న, కొమ్ము ముఖేష్, కుందేళ్ల పర్వతాలు, ఆకారం శేఖర్, ఆకారం లక్ష్మయ్య, ఆకారం కాశయ్య, కొమ్మ కొండలు, నాంపల్లి శంకర్, గాదెపాక మధు, కానీ, శెట్టి శ్రీకాంత్ ఎర్ర సైదమ్మ, భూతం కలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Next Story