నిర్లక్ష్యం కారణంగానే… శ్రీశైలంలో అగ్ని ప్రమాదం

by  |
నిర్లక్ష్యం కారణంగానే… శ్రీశైలంలో అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ప‌వ‌ర్ ప్లాంట్‌లో గురువారం అర్ధ‌రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడి భారీ ప్రమాదం జరిగింది. దీంతో ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే నిర్లక్ష్యంతోనే శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిందని సీపీఎం నేత గపూర్ ఆరోపించారు. ఘటనపై అమరరాజా కంపెనీకి బాధ్యత ఉందన్నారు.

ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. డ్యాం ప్రయోజనాలు పొందడమే తప్ప నిర్వహణను వదిలేశారని తప్పుబట్టారు. ప్రమాదం జరిగినప్పుడే మాట్లాడుతున్నారు తప్ప ముందు జగ్రత్త లేదన్నారు. డ్యాం తెగితే బెజవాడ మునిగిపోతుందని, నిష్ణాతులతో ప్రమాదంపై విచారణ జరిపించాలని, బాధిత కుటంబాలకు రూ. కోటి పరిహారమివ్వాలని గఫూర్ డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed