- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. కల్లాల వద్ద CPI(ML) ధర్నా
<p>దిశ, ఖమ్మం రూరల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అఖిలభారత రైతుకూలి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని కాచిరాజుగూడెం గ్రామంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కల్లాల దగ్గర ధర్నా నిర్వహించారు. సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న మొండి వైఖరికి నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చామని, రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ […]</p>

దిశ, ఖమ్మం రూరల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అఖిలభారత రైతుకూలి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని కాచిరాజుగూడెం గ్రామంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కల్లాల దగ్గర ధర్నా నిర్వహించారు. సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న మొండి వైఖరికి నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చామని, రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా యాసంగిలో వరి వేసే రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు లింగయ్య, కోటయ్య, నాయకులు అప్పారావు, మోహన్ రెడ్డి, అంజయ్య, ఉపేంద్ర రావు, నాగేశ్వర రావు, వెంకటయ్య, శ్రీను, మల్లిఖర్జునరావు, లింగయ్య, ఉపేందర్, వెంకటరాములు, నాగభూషనం, బాబు తదితరులు పాల్గొన్నారు.






