కార్మికులను నిర్బంధించడం సరికాదు

by  |
కార్మికులను నిర్బంధించడం సరికాదు
X

– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

దిశ, న్యూస్‌బ్యూరో: వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి కోరినా.. ఇవ్వకుండా నిర్బంధించడం సరైన పద్ధతి కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. హైదరాబాద్‌, శేరిలింగంపల్లిలోని నానక్ రామ్‌గూడ పరిధిలో సుమారు 6 వేల మంది అంతర్రాష్ట్ర కార్మికులను యాజమాన్యం పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు సీపీఐ దృష్టికి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో నారాయణ, ఇతర నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మార్చి 22 నుంచి నేటి వరకు కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేక, ఇక్కడ సరైన వసతులు, ఆహారం దొరకని పరిస్థితుల్లో అవస్థలు పడుతుంటే యాజమాన్యాలు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఒక పక్క కరోనా వైరస్ బారిన పడకుండా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతూ.. మరోవైపు కార్మికులను చిన్న చిన్న గదుల్లో పదుల సంఖ్యలో ఉంచడమేమిటని నిర్మాణరంగ యాజమాన్యాలను నిలదీశారు. తక్షణమే వలస కార్మికులను తమ సొంత ప్రాంతాలకు పంపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.


Next Story