- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాందేవ్ బాబాపై కేసు.. సీపీఐ నారాయణ హర్షం
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: రాజస్థాన్‌లో 420 సెక్షన్ కింద బాబా రాందేవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేయడమే కాకుండా తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమైన సోమవారం నారాయణ ఓ ప్రకటన చేశారు. కొవిడ్-19కు మందులు కనుగొన్నామని ప్రజల్ని, శాస్త్రజ్ఞులను మోసం చేస్తూ ప్రకటించారని పేర్కొన్నారు. పతంజలి సంస్థను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి షేర్ మార్కెట్‌లో విలువలు పెంచుకునే మోసం తప్ప మరొకటి […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: రాజస్థాన్‌లో 420 సెక్షన్ కింద బాబా రాందేవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేయడమే కాకుండా తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమైన సోమవారం నారాయణ ఓ ప్రకటన చేశారు. కొవిడ్-19కు మందులు కనుగొన్నామని ప్రజల్ని, శాస్త్రజ్ఞులను మోసం చేస్తూ ప్రకటించారని పేర్కొన్నారు. పతంజలి సంస్థను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి షేర్ మార్కెట్‌లో విలువలు పెంచుకునే మోసం తప్ప మరొకటి కాదని విమర్శించారు. ప్రజలను మోసం చేసే హక్కు ఎవ్వరికి లేదని నారాయణ హెచ్చరించారు.
Next Story






