పేదల కోసం చివరివరకు పోరాడిన యోధుడు శ్రీశైలం

by Sridhar Babu |   ( Updated:2021-08-27 06:51:25.0  )
CPI (ML) leaders
X

దిశ, మణుగూరు: పొట్లపల్లి శ్రీశైలం మరణం సీపీఐ పార్టీకి తీరనిలోటు అని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత మోర రవి అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం విజయనగరం గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు దుబ్బాక జగ్గన్న అధ్యక్షతన పొట్లపల్లి శ్రీశైలం సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న రవి మాట్లాడుతూ… ఖమ్మం డివిజన్ ఉద్యమ నిర్మాణంలో శ్రీశైలం పాత్ర కీలకమైనదని తెలిపారు. భూమిలేని నిరుపేదల కోసం ఎంతో పోరాటం చేశాడని, అనేక మంది పేదలకు భూములు పంచాడని తెలిపారు. నాడు భూస్వాములకు, పెత్తందార్లకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న కాలంలో, 1980 సంవత్సరంలో నిర్వహించిన ఖమ్మం డివిజన్ మహసభ కీలకమైనదని గుర్తుచేశారు. ఆ కామ్రేడ్‌కి సీపీఐఎంఎల్ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోదందని వెల్లడించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మండల నాయకులు కంపెర్ల పెద్దసూర్యం, మల్లికంటి రాము, మైపా పెద్దరాంబాబు, అచ్చయ్య, అలివేలు, రామకృష్ణ, రాంబాబు, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story