పదిరోజుల లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలి

by  |
CP Satyanarayana
X

దిశ, ఆసిఫాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొమురం భీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సీపీ సత్యనారాయణ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదిరోజుల లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. మినహాయింపు ఇచ్చిన నాలుగు గంటల సమయంలోనే ప్రజలు ఏవైనా ప్రయాణాలు, అవసరాలు తీర్చుకోవాలని తెలిపారు.

పది దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని, అనవసరంగా రోడ్లపైకి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోవిడ్ రోగులు అయితే ఆస్పత్రి లెటర్‌తో పాటు కొవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా జారీ చేసిన పాసులు ఉండాలని సూచించారు. నిబంధనలు పకడ్బంధీగా అమలు చేయాలని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. ఈ తనిఖీలో ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్ రావు, వాంకిడి సీఐ సుధాకర్, ఎస్ఐ రమేష్, ఇతర పోలీస్ అధికారులున్నారు.


Next Story