పండుగల పేరుతో కోవిడ్ నిబంధనలకు తూట్లు..!

by  |
పండుగల పేరుతో కోవిడ్ నిబంధనలకు తూట్లు..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్:
పండుగల పేరుతో కొంతమంది కోవిడ్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీంతో హైదరాబాద్ వంటి మహానగరంలో కరోనా అదుపులోకి రావడం లేదు. ఈ ఏడాది మార్చి నుంచి కోవిడ్ కట్టుబాట్లు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఇప్పటి వరకు కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గకపోగా ఇటీవల మరింత పెరిగింది. కొంతమంది పండుగలను సాకుగా చూపి వందల సంఖ్యలో ఒక్క దగ్గర జమ అవుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో కేసులు మరింత అధికం అవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గనప్పటికీ కొంతమంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి గుంపులు గుంపులుగా తిరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. గత నెలలో ఓ వర్గానికి చెందిన రెండు ముఖ్య పండుగల సందర్భంగా పాతబస్తీలో ప్రజలు కరోనా నిబంధనలను పట్టించుకోకుండా రోడ్లపైకి చేరారు. మర్కజ్ లింకు లేకపోతే తెలంగాణ రాష్ట్రం కరోనా ఫ్రీ రాష్ట్రంగా ఉండేదని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల పాతబస్తీలో అదే వర్గానికి చెందినవారు నిబంధనలు పాటించక పోయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


Next Story

Most Viewed