- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలోనే పాజిటివ్ పేషెంట్ ఆత్మహత్య..
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండ్రోజుల కిందట కరోనా పాజిటివ్ వచ్చిన మరియమ్మ (65) అనే మహిళ ఆస్పత్రి వాష్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం సాయంకాలం చోటుచేసుకోగా స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే .. కరోనాకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మరియమ్మ తనకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిస్తే గ్రామస్థులు దూరం పెడుతారని ఆవేదనకు గురైంది. దానికితోడు ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం.. వైద్యులు […]</p>

దిశ ప్రతినిధి, ఖమ్మం :
ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండ్రోజుల కిందట కరోనా పాజిటివ్ వచ్చిన మరియమ్మ (65) అనే మహిళ ఆస్పత్రి వాష్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం సాయంకాలం చోటుచేసుకోగా స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకివెళితే .. కరోనాకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన మరియమ్మ తనకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిస్తే గ్రామస్థులు దూరం పెడుతారని ఆవేదనకు గురైంది. దానికితోడు ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం.. వైద్యులు అందించే చికిత్స వల్ల రోగం నయం అవుతుందో లేదో అని తీవ్ర ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలోనే ఎవరూ లేని సమయం చూసి వాష్‌రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, గార్ల మండలం బుద్ధారం గ్రామానికి చెందిన బాధితురాలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకోవటం అందరినీ కలిచివేసింది.






