- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్గొండ జిల్లా ఆస్పత్రిలో కరోనా ఐసీయూ వార్డ్
<p>దిశ, నల్గొండ: నల్గొండ జిల్లా ఆస్పత్రిలో కరోనా ఐసీయూ వార్డు ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్ నియంత్రణలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందిస్తోన్న నిరంతర సేవలను అభినందించారు. ఇంతటి విపత్తు సమయంలో వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి […]</p>

X
దిశ, నల్గొండ: నల్గొండ జిల్లా ఆస్పత్రిలో కరోనా ఐసీయూ వార్డు ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్ నియంత్రణలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందిస్తోన్న నిరంతర సేవలను అభినందించారు. ఇంతటి విపత్తు సమయంలో వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Tags:Collector Prashant Jeevan Patil, Kovid ICU ward, Nalgonda hospital
Next Story






