- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుర్గగుడికి కరోనా ఎఫెక్ట్.. అమ్మవారి దర్శనంపై కొత్త ఆంక్షలు
<p>దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దుర్గగుడి అధికారులు ప్రత్యేక ప్లాన్ రూపొందించారు. అమ్మవారి దర్శనంపై ఆంక్షలు విధించారు. దుర్గగుడిలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా ఉత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకు 10 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. గతంలో రోజుకు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేవారు. […]</p>

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దుర్గగుడి అధికారులు ప్రత్యేక ప్లాన్ రూపొందించారు. అమ్మవారి దర్శనంపై ఆంక్షలు విధించారు. దుర్గగుడిలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా ఉత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకు 10 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
గతంలో రోజుకు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేవారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల హెచ్చరికల నేపథ్యంలో రోజుకు పదివేల మందిని మాత్రమే అనుమతించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉచిత దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఒక్క రూపాయి చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. భవానీ దీక్ష చేపట్టే భక్తులు అధికంగా వస్తున్నందున ఇరుముడికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం దర్శనానికి మాత్రమే అనుమతి కల్పిస్తామని వివరించారు.






