ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

by  |
Extension of curfew in AP
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా కట్టడిలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇచ్చిందని.. కేసుల సంఖ్య తగ్గుతుండటంతోపాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందన్నారు. ఈనెల 20 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని.. 20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ ఉంటుందని స్పష్టం చేశారు. కర్ఫ్యూ మంచి ఫలితాలు ఇస్తున్న తరుణంలో పెంచే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 20 తర్వాత ఉదయం 6 గంటల నంచి సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఉండే అవకాశం ఉందని సమాచారం. లేకపోతే రాత్రిపూట కర్ఫ్యూ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని, గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించారు.



Next Story

Most Viewed