కోవిడ్ ఎఫెక్ట్… 28 మిలియన్ల ఆపరేషన్లు వాయిదా

by  |
కోవిడ్ ఎఫెక్ట్… 28 మిలియన్ల ఆపరేషన్లు వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్‌: కరోనా కట్టడికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో 28 మిలియన్ల ఆపరేషన్లు వాయిదా వేసినట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. మొత్తంగా 12 వారాలపాటు సర్జరీలను వాయిదా వేసిన డాక్టర్లు.. ప్రతి వారానికి దాదాపు 2.4 మిలియన్లు సర్జరీలను క్యాన్సిల్ చేసినట్లు సదరు అధ్యయనం స్పష్టం చేసింది.

కొవిడ్ 19 కారణంగా మనదేశంలో 5.8 లక్షల సర్జరీలు ఆగిపోగా.. ఇందులో నాన్ ఎమర్జెన్సీ సర్జరీలు 5,05,800 ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. కేన్సర్ ఆపరేషన్ల విషయానికొస్తే 51,100 ఆగిపోగా.. 27,700 ఆబ్‌స్టెట్రిక్ సర్జరీలు పోస్ట్‌పోన్ అయ్యాయి. అదే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. 2.3 మిలియన్ల కేన్సర్ సర్జరీలు, 6.3 మిలియన్ల ఆర్థోపెడిక్ సర్జరీలు నిలిచిపోయాయి. పోస్ట్‌పోన్ అయిన ఆపరేషన్లను పూర్తి చేసేందుకు దాదాపు 45 వారాల సమయం పడుతుందని, అత్యవసర కేసులకు సంబంధించిన ఆపరేషన్లు వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరముందని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ రఘురాం చెప్పారు. ఒక ఢిల్లీలోనే నెలకు 5 వేలకుపైన కేన్సర్ సర్జరీలు జరిగేవని, కానీ చివరి నెలలో కేవలం 500 మాత్రమే జరిగాయని వైద్యులు తెలిపారు. కంటి ఆపరేషన్లు ఎక్కువకాలం పోస్ట్‌పోన్ చేయకూడదని, వీలైనంత త్వరగా వాయిదా వేసిన ఆపరేషన్లు పూర్తి చేయాలని నేత్ర వైద్యులు సూచిస్తున్నారు.


Next Story

Most Viewed