- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొవిడ్-19 వ్యాక్సిన్ వైల్స్ పగిలిపోయాయి
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రజలకు అందించాల్సిన కొవిడ్-19 వ్యాక్సిన్ వైల్స్ పగిలిపోయిన ఘటన మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పిఠాపురం మండలంలోని విరవ ప్రభుత్వాస్పత్రికి తరలించిన కోవిషీల్డ్ వైల్స్ పగిలిపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆందోళన చెందారు. పిఠాపురం ప్రభుత్వాస్పత్రి నుంచి 6 వైల్స్‌ను ప్రత్యేక బాక్సులో విరవ ఆస్పత్రి హెల్త్ సూపర్‌వైజర్ రమణ, హెడ్ కానిస్టేబుల్ ఏసు.. విరవ ఆస్పత్రికి ఆదివారం తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది వాటిని తెరచి చూడగా 3 వైల్స్ […]</p>

దిశ, ఏపీ బ్యూరో: ప్రజలకు అందించాల్సిన కొవిడ్-19 వ్యాక్సిన్ వైల్స్ పగిలిపోయిన ఘటన మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పిఠాపురం మండలంలోని విరవ ప్రభుత్వాస్పత్రికి తరలించిన కోవిషీల్డ్ వైల్స్ పగిలిపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆందోళన చెందారు. పిఠాపురం ప్రభుత్వాస్పత్రి నుంచి 6 వైల్స్‌ను ప్రత్యేక బాక్సులో విరవ ఆస్పత్రి హెల్త్ సూపర్‌వైజర్ రమణ, హెడ్ కానిస్టేబుల్ ఏసు.. విరవ ఆస్పత్రికి ఆదివారం తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది వాటిని తెరచి చూడగా 3 వైల్స్ పగిలిపోయి ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పగిలిన మూడింటితో 30మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. హెల్త్ సూపర్‌వైజర్ రమణ పిఠాపురం నుంచి వ్యాక్సిన్ తీసుకువస్తుండగా ప్రమాదం జరిగి వ్యాక్సిన్ ఉన్న బాక్స్ కింద పడిపోయిందని, దీనివల్ల మూడు వైల్స్ పగిలిపోయాయని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలిపారు.






