56.5లక్షల డోసులు.. 9 ప్రత్యేక విమానాలు

81

దిశ,వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు పంపిణీ అవుతున్నాయి. భారత్ కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ పూణే నుంచి దేశంలో ఉన్న పలు రాష్ట్రాలకు 9 ప్రత్యేక విమానాల ద్వారా వ్యాక్సిన్ కంటైనర్లను పంపిస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ పూరీ తెలిపారు.

కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. పూణే నుంచి సుమారు 56.5లక్షల డోసులున్న కరోనా వ్యాక్సిన్ల కంటైనర్లు ఢిల్లీ, చెన్నై, కోల్ కత్తా, గౌహతి, మేఘాలయాలోని షిల్లాంగ్, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, పాట్నా, బెంగళూర్, లక్నో, చంఢీగఢ్ కు చేరుకోనున్నాయి.

కాగా సీరం ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్తంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను తయారు చేశాయి. ఈ కోవిషీల్డ్ 32కిలోల బరువున్న 478 బాక్సుల వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా 13 ప్రదేశాలకు పంపిణీ అవుతుంది. ఇక భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్, తో పాటు సీరం తయారు చేసిన కోవిషీల్డ్ కు చెందిన 6కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేసేలా కేంద్రం ఒప్పొందం కుదుర్చుకుంది. కరోనా వ్యాక్సిన్ అప్‌డేట్ కోసం https://www.dishadaily.com ను ఫాలో అవ్వండి.

for more news :

కరోనా వ్యాక్సిన్ వచ్చేసిందోచ్..