ఓయో ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులే పని!

by  |
ఓయో ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులే పని!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిథ్య రంగ హోటల్ బుకింగ్ సంస్థ ఓయో కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారంలో నాలుగు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది. కొవిడ్ కారణంగా ఉద్యోగులను శారీరక, మానసిక ఇబ్బందుల నుంచి రక్షించడం కోసమే ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని ఓయో వ్యవస్థాపకుడు, సీఈఓ రితేష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా తెలిపారు. వారంలో నాలుగు రోజుల పని దినాలను, భిన్నంగా అమలు చేస్తామని రితేష్ చెప్పారు. ఓయో ఉద్యోగులు బుధవారం రోజుల మిడ్-వీక్ ఆఫ్ తీసుకునే వెసులుబాటును ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఉద్యోగుల కోసం పెయిడ్ లీవ్స్‌ని ఇవ్వనున్నట్టు తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి అందరం బయటపడాలని ఆశిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షోభంపై పోరాడేందుకు సిద్ధమవ్వాలని, అందరూ సురక్షితంగా ఉండాలని రితేష్ అగర్వాల్ చెప్పారు.


Next Story

Most Viewed