కరోనాపై అవగాహన పాట ఆవిష్కరణ

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: కోటి ఈఎన్‌టీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ రమేష్, డాక్టర్ రవిశంకర్ నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19)పై అవగాహన పాటను రూపొందించారు. బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ పాటను కోటిలోని కొవిడ్ కంట్రోల్ రూంలో ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ,పాట సందేశాత్మకంగా ఉందని కొనియాడారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు. పాటను డాక్టర్ రమేశ్ రచించగా, ప్రముఖ నటులు శివారెడ్డి, జబర్దస్త్ ఫేం రాకింగ్ రాకేష్ [&hellip;]</p>

కరోనాపై అవగాహన పాట ఆవిష్కరణ
X

దిశ, వెబ్ డెస్క్: కోటి ఈఎన్‌టీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ రమేష్, డాక్టర్ రవిశంకర్ నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19)పై అవగాహన పాటను రూపొందించారు. బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ పాటను కోటిలోని కొవిడ్ కంట్రోల్ రూంలో ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ,పాట సందేశాత్మకంగా ఉందని కొనియాడారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు. పాటను డాక్టర్ రమేశ్ రచించగా, ప్రముఖ నటులు శివారెడ్డి, జబర్దస్త్ ఫేం రాకింగ్ రాకేష్ రూపకల్పన చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, ఈఎన్‌టీ వైద్యులు
పాల్గొన్నారు.

Tags: covid 19, novel coronavirus, awareness song, launch, minister, etela rajender, koti ent

Next Story