ఈటల ఫోటోతో కవర్లు.. ఒక్క ఓటుకు ఎంత ఇచ్చారో తెలుసా.!(వీడియో)

617

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రమంతా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ టైం సమీపిస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా చేసిన ప్రచారం బుధవారంతో ముగిసింది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఇంటింటికీ అభ్యర్థులు ఎన్వలప్ కవర్లు పంచుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరి చూపు హుజురాబాద్ వైపు మళ్లింది. హుజురాబాద్‌లో ఓటుకు రూ.6 వేలు.. కాదు.. కాదు.. ఓటుకు రూ.20 వేలు అంటూ జరుగుతున్న ప్రచారంతో పుడితే హుజురాబాద్‌లోనే పుట్టాలంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో బుధవారం అధికార పార్టీ నాయకులు ఓటుకు రూ.6 వేలు పంచారని ఎన్వలప్ కవర్లు దర్శనిమివ్వడంతో ఆ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఏ నలుగురు కలిసి మాట్లాడుకున్నా ఓటుకు నోట్ల విషయం గురించే చర్చ జరిగింది. అయితే, అనూహ్యంగా బీజేపీ వాళ్లు కూడా ఓటుకు రూ.10వేలు పంచారంటూ సోషల్ మీడియాలో వీడియోలు దర్శనమిస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన ఎన్వలప్ కవర్‌పై ఈటల రాజేందర్, కమలం గుర్తు ఉండటం గమనార్హం. అయితే, దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది టీఆర్ఎస్ వాళ్ల పనేనంటూ విమర్శలు చేస్తున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..