కోవాగ్జిన్ టీకా ధర రూ.295

53

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ కేంద్రంగా తయారైన కరోనా టీకా కోవాగ్జిన్ ధరను రూ.295గా భారత్ బయోటెక్ కంపెనీ నిర్ణయించింది. తొలుత వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉండొచ్చనే ఊహగానాలకు ఎట్టకేలకు యాజమాన్యం ఫుల్‌స్టాప్ పెట్టింది.

అయితే, జనవరి 14లోపు 55 లక్షల డోసులను సరఫరా చేయాలని కేంద్రం భారత్ బయోటెక్ సంస్థను కోరింది. మొదటి దశలో 38.5 లక్షల డోసులు, రెండో దశలో 16.5 లక్షల డోసులను డెలివరీ చేయాల్సిందిగా పేర్కొంది. ఇదిలాఉండగా, 16.5 లక్షల డోసులను ఉచితంగా అందించునున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ తాజాగా ప్రకటించింది.

కాగా, ఇప్పటికే కోవిషీల్డ్ ధరను జీఎస్టీతో కలిపి సీరమ్ కంపెనీ రూ.210గా నిర్ణయించిన విషయం తెలిసిందే.