50 వేల కోసం చెల్లెలిని నగ్నంగా మార్చి అత్యాచారం

by  |
cousin brother rape attempt on a girl
X

దిశ, వెబ్‌డెస్క్ : సొంత పిన్ని కూతురు అంటే ఒక్క గర్భం నుంచి పుట్టకపోయినా సొంత చెల్లెలే. అయినా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గపు అన్న. అన్న అనే పదానికే మచ్చ తెచ్చిన అతడు.. చెల్లెలుకు మత్తు మందు ఇచ్చి ఈ దుశ్చర్యకు తెగబడ్డాడు. ఆమెను నగ్నంగా మార్చి ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఇదంతా కేవలం రూ.50 వేల కోసం చేశాడీ నీచుడు.

కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు ఫిలింనగర్‌లో ఉంటున్నారు. వీరి పెద్దమ్మ కుటుంబం నగరంలోనే నివసిస్తోంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. కాగా మార్చి ఒకటో తేదిన అన్నదమ్ముల్లో ఒకడైన నిఖిల్ (27) పెద్దమ్మ కూతురైన రెండో అమ్మాయి ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తుండడంతో తన అవసరాల కోసం రూ.50 వేలను అడిగాడు. అన్న అడగడంతో ఆ యువతి కాదనలేక ఇచ్చింది. ఆ డబ్బులను తెల్లారే ఇస్తాననడంతో ఆమె మార్చి 2న ఫిలింనగర్ లోని సోదరుని రూంకు వెళ్లింది. ఆమెకు కూల్ డ్రింక్ ఇవ్వడంతో తీసుకుంది. దానికి తాగిన కొద్ది నిమిషాల్లోనే మత్తులోకి జారుకుంది. మెలుకువ వచ్చిన తర్వాత.. డబ్బులు మూడు రోజుల తర్వాత ఇస్తానని చెప్పడంతో ఇంటికి వెళ్లిపోయింది.

నిఖిల్‌కు మూడు రోజుల తర్వాత ఆ యువతి ఫోన్ చేసింది. తన డబ్బులు పంపించాలని కోరింది. అప్పుడే అన్నలోని మరో రూపం బయటపడింది. చెల్లి ఫోన్‌కు ఆమె నగ్న చిత్రాలు, వీడియోలు వరుసగా సెండ్ చేశాడు. వాటిని చూసిన ఆమె షాక్‌కు గురైంది. వాటి గురించి ప్రశ్నించిన ఆమెకు కళ్లు బైర్లు కమ్మే నిజం చెప్పాడు. ‘‘తన రూంకు వచ్చిన సమయంలో కూల్ డ్రింక్ లో మద్యం కలిపి ఇచ్చానని, నువ్వు మత్తులోకి జారుకున్నాక.. నీ దుస్తువులు ఇప్పి అత్యాచారం చేశానని, అప్పుడే ఈ ఫొటోలు, వీడియోలు తీశానని’’ చెప్పాడు. డబ్బులు అడిగినా, ఈ విషయం బయట చెప్పినా నీ నగ్న చిత్రాలు ఇంటర్ నెట్ లో ప్రత్యేక్షం అవుతాయని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు తనలోతానే మధనపడుతూ సైలెంట్ గా ఉండిపోయింది.

వారం రోజులుగా యువతి నీరసంగా ఉండడం, ఏడుస్తూ ఉండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. అసలేం జరిగిందని నిలదీయడంతో అన్న చేసిన మోసం గురించి వివరించింది. వెంటనే వాళ్లు పోలీస్ స్టేషన్ లో తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. యువకుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు యువకుడిని బుధవారం అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed