పట్టువీడయ్యా శంకర్.. భారతీయుడికి మోక్షం కలిగించు!

by  |
పట్టువీడయ్యా శంకర్.. భారతీయుడికి మోక్షం కలిగించు!
X

దిశ, సినిమా : ప్రముఖ సౌత్ ఇండియన్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ‘భారతీయుడు2’ మూవీ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. కొంత షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అన్నివార్య కారణాల వల్ల ఇప్పటిదాకా వాయిదాపడుతూ వస్తోంది. సెట్స్‌లో క్రేన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్నాళ్లకు షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా, కొవిడ్ కారణంగా మళ్లీ పోస్ట్‌పోన్ అయింది. పైగా కరోనా ఎఫెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలోనే పలువురు ఫిల్మ్ మేకర్స్ రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిందిగా స్టార్లను కోరారు.

ఈ క్రమంలోనే ‘భారతీయుడు2’ మేకర్స్ లైకా ప్రొడక్షన్స్ సైతం ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం కోసం డైరెక్టర్ శంకర్‌ను రెమ్యునరేషన్ తగ్గించుకోమంది. కానీ శంకర్ అందుకు ససేమిరా అనడంతో ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయితే లైకా ప్రొడక్షన్స్ తాజాగాశంకర్‌పై మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. ఇండియన్ 2 పూర్తిచేసేంత వరకు శంకర్ వేరే సినిమాకు పనిచేయకుండా బ్యాన్ విధించాలని అందులో పేర్కొంది. అయితే ఈ ఫైల్‌పై స్పందించిన హైకోర్టు.. కలిసికట్టుగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సూచించింది. మరి ఇప్పటికైనా ఈ భారీ ప్రాజెక్టుకు మోక్షం కలుగుతుందో లేదో చూడాలి. కాగా రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో సిద్దార్థ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.



Next Story

Most Viewed