- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి దొరికింది.. మృత్యువు కబళించింది
<p>దిశ, నిజామాబాద్: ఉపాధి లభించిన చోటనే విద్యుత్ మృత్యువు రూపంలో కబలించింది. ఫాంహౌస్‌లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఓ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన డిచ్‌పల్లి మండలం మిట్టపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లికి చెందిన ధారావత్ శంకర్, మరోనిబాయి దంపతులు మిట్టపల్లిలోని ఓ ఫాంహౌస్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు వీరికి కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు […]</p>

X
దిశ, నిజామాబాద్: ఉపాధి లభించిన చోటనే విద్యుత్ మృత్యువు రూపంలో కబలించింది. ఫాంహౌస్‌లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఓ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన డిచ్‌పల్లి మండలం మిట్టపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లికి చెందిన ధారావత్ శంకర్, మరోనిబాయి దంపతులు మిట్టపల్లిలోని ఓ ఫాంహౌస్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు వీరికి కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఫాంహౌస్ నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ న్యాయవాదిదిగా పోలీసులు గుర్తించారు.
Next Story






