- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులో ఒక జంట అనుమానస్పద స్థితి లో మృతిచెందారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. మృతులను నాగిరెడ్డిపేట్ మండలం బెజ్జం చెరువు గ్రామపంచాయతీ సర్పంచ్ హరిలాల్ అల్లుడు, కూతురుగా గుర్తించారు. మేఘవత్ మహేందర్, సరిత ఆరు నెలల క్రితమే వివాహమైందని సమాచారం. వారు కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో ఉంటున్నట్టు తెలిసింది. గురువారం సాయంత్రం ప్రాంతంలో పోచారం డ్యామ్‌లో అనుమానస్పదంగా ఉన్న ఇద్దరి మృత దేహాలను […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులో ఒక జంట అనుమానస్పద స్థితి లో మృతిచెందారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. మృతులను నాగిరెడ్డిపేట్ మండలం బెజ్జం చెరువు గ్రామపంచాయతీ సర్పంచ్ హరిలాల్ అల్లుడు, కూతురుగా గుర్తించారు.
మేఘవత్ మహేందర్, సరిత ఆరు నెలల క్రితమే వివాహమైందని సమాచారం. వారు కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో ఉంటున్నట్టు తెలిసింది. గురువారం సాయంత్రం ప్రాంతంలో పోచారం డ్యామ్‌లో అనుమానస్పదంగా ఉన్న ఇద్దరి మృత దేహాలను గుర్తించి వెలికి తీశారు. వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేక ప్రమాదవశాత్తు నీటిలో పడ్డారా? అని మృతికి సంబంధించిన కారణాలను వెతికి తీస్తున్నారు. ఈ మేరకు నాగిరెడ్డిపేట్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
Next Story






