- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డిలో కరోనాతో దంపతులు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా కాకవికలం చేస్తోంది. కరోనా సోకి చాలామంది ప్రజలు ప్రాణాలుకోల్పోతున్నారు. పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. మరికొన్ని కుటుంబాల పరిస్థితి అయితే వర్ణనాతీతం. తాజాగా కామారెడ్డిలో జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరిలో కన్నీళ్లు పెట్టకతప్పడంలేదు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లాలో దంపతులు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో రాజేశ్-స్రవంతి అనే వీరిద్దరూ దంపతులు. అయితే, వీరిద్దరూ కరోనా మృతిచెందారు. […]</p>

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా కాకవికలం చేస్తోంది. కరోనా సోకి చాలామంది ప్రజలు ప్రాణాలుకోల్పోతున్నారు. పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. మరికొన్ని కుటుంబాల పరిస్థితి అయితే వర్ణనాతీతం. తాజాగా కామారెడ్డిలో జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరిలో కన్నీళ్లు పెట్టకతప్పడంలేదు.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లాలో దంపతులు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో రాజేశ్-స్రవంతి అనే వీరిద్దరూ దంపతులు. అయితే, వీరిద్దరూ కరోనా మృతిచెందారు. కరోనా సోకి ఈనెల 7న భర్త రాజేష్ మృతిచెందాడు. నేడు ఉదయం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య స్రవంతి కూడా కన్నుమూసింది. దీంతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరో బాధాకర విషయమేమిటంటే… మృతుడు రాజేష్ కూతురు, తండ్రికి కరోనా సోకింది. దీంతో వారు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా రాజేష్ అంత్యక్రియల్లో పాల్గొన్న 9 మందికి కూడా కరోనా సోకింది. వీరంతా కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది.






