హోటల్లో వ్యభిచారం.. కామక్రీడల్లో ఆ జంట.. వారెవరో తెలిసి షాకైన పోలీసులు

by  |
హోటల్లో వ్యభిచారం.. కామక్రీడల్లో ఆ జంట.. వారెవరో తెలిసి షాకైన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో వివాహేతర సంబంధాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పరాయి వారి మోజులో కుటుంబాలను కాలదన్నుతున్నారు. చివరికి పోలీసుల చేతికి చిక్కి, కుటుంబ పరువును బజారుకీడుస్తున్నారు. తాజాగా ఒక ప్రేమ జంట హోటల్ లో కామక్రీడలు నడుపుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా బుక్కయ్యారు. వారి గురించి తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. భార్య భర్తకు తెలియకుండా.. భర్త ఆమె భార్యకు తెలియకుండా వివాహేతర సంబంధం పెట్టుకొని హోటల్ లో శృంగార కార్యకలాపాల్లో మునిగితేలిన ఘటన బీహార్ లో సంచలనం సృష్టిస్తోంది.

వివరాలలోకి వెళితే.. మోతీహారి పట్టణంలోని పానీ ట్యాంక్ చౌక్ దగ్గరలో ఉన్న ఓ రెసిడెన్షియల్ హోటల‌్‌లో వ్యభిచార దందా జోరుగా సాగుతోంది. పైకి ఫ్యామిలీ హోటల్ గా చెప్పి లోపల వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు మంగళవారం రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ లో రాసలీలల్లో మునిగితేలుతున్న జంటల గుట్టు బయటపడింది. వ్యభిచార దందా నిర్వహించే విటులను, అమ్మాయిలను సప్ప్లై చేసే వ్యక్తులను పోలీసులను అరెస్ట్ చేశారు.

ఇక ఒక గదిలో ఒక ప్రేమ జంటను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు వారు చెప్పిన విషయం విని షాక్ అయ్యారు.. ముందు వారు విటుడు, వేశ్య అనుకున్న పోలీసులు వారిని విచారించగా.. తామిద్దరికి విడివిడిగా పెళ్ళైపోయిందని, గతం కొంతకాలంగా తమ మధ్య వివాహేతర సంబంధం నడుస్తోందని చెప్పుకొచ్చారు. ఇంటిదగ్గర కలవడం కుదరడం లేదని, ఇలా హోటల్ లో రూమ్ బుక్ చేసినట్లు ఆ జంట చెప్పారు. దీంతో వారిద్దరిపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed