బెజోస్ ఆస్తికి బియ్యం గింజల లెక్క!

by  |
బెజోస్ ఆస్తికి బియ్యం గింజల లెక్క!
X

దిశ, వెబ్‌డెస్క్:

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆస్తి ఎంత ఉంటుందనే ప్రశ్నకు 114 బిలియన్ డాలర్లు అని సమాధానం ఇవ్వొచ్చు. కానీ 114 బిలియన్ డాలర్లు అనగానే డాలర్ల డబ్బు కట్టలు ఊహించుకోవచ్చు. కానీ ఓ టిక్ టాక్ సెలెబ్రిటీ చేసిన ప్రయోగం చూశాక మీ ఊహ మారుతుంది. ఆ వీడియో చూశాక బెజోస్ ఆస్తిని డాలర్లలో కాకుండా బియ్యం లెక్కల్లో కొలుస్తారు.

ఫ్రీ లాన్సర్‌గా సిలికాన్ వ్యాలీలో పనిచేసే టిక్ టాక్ స్టార్ హంఫ్రీ యాంగ్, జెఫ్ బెజోస్ ఆస్తిని బియ్యంతో కొలిచాడు. ఒక బియ్యం గింజను లక్ష డాలర్లుగా పరిగణించాడు. తర్వాత పది బియ్యం గింజలను ఒక మిలియన్ డాలర్లుగా లెక్కపెట్టాడు. ఇక ఒక బిలియన్ డాలర్లు అవడానికి పది వేల గింజలను కూర్చొని ఒక్కొక్కటిగా లెక్కపెట్టాడు. ఒక బిలియన్ డాలర్ వరకు లెక్కపెట్టిన వీడియోను టిక్ టాక్‌లో పోస్టు చేస్తే చాలా లైకులు వచ్చాయి. దీంతో అదే కోవలో మరో వీడియో చేయాలనుకున్నాడు. ఈసారి ఏకంగా బెజోస్ ఆస్తిని లెక్కించాలని అనుకున్నాడు.

ఒక బిలియన్‌కి పదివేల గింజలు కాబట్టి వాటి బరువు చూశాడు. ఆ బరువును బట్టి రెండు బియ్యం బస్తాలను కొనుక్కొచ్చాడు. వాటి బరువు ఆధారంగా ఆరోజుకి జెఫ్ బెజోస్ ఆస్తిని 127 బిలియన్ డాలర్లకు లెక్కించాడు. అంతేకాకుండా ఇటీవల బెజోస్ కొన్న ఇంటి ధరను ఆ బియ్యం నుంచి తీసేశాడు. ఆస్తి మార్పులో ఏ మాత్రం తేడా కనిపించలేదని జోక్ చేశాడు. ఈ వీడియో కూడా టిక్ టాక్‌లో బాగా వైరల్ అయింది. తాను పదివేల గింజలు ఒక్కొక్కటి లెక్కపెట్టిన వీడియోను యూట్యూబ్‌లో పెట్టాడు. ఈ వీడియో చేయడానికి కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా మంచి స్పందన వస్తుండటం ఆనందకరంగా ఉందని యాంగ్ తెలిపారు.



Next Story