- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు కౌన్సిలింగ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహణకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 31న, వచ్చే నెల 1వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ అరుణ కుమారి పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల ఖాళీల వివరాలను, ఎంపికైన అభ్యర్థులకు సూచనలు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహణకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 31న, వచ్చే నెల 1వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ అరుణ కుమారి పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల ఖాళీల వివరాలను, ఎంపికైన అభ్యర్థులకు సూచనలు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వెబ్‌సైట్ (cfw.ap.nic.in)లో పెట్టామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు 15 నిముషాల ముందుగానే వెబ్‌సైట్‌లో పెట్టిన ఐడీ, పాస్ వర్డ్ ఆధారంగా లాగిన్ అవ్వాలని సూచించారు.
Next Story






