మల్లన్న సన్నిధిలో అవినీతి కుంభకోణం?

by  |
మల్లన్న సన్నిధిలో అవినీతి కుంభకోణం?
X

దిశ ఏపీ బ్యూరో: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో ఆలయ దర్శన టికెట్లు, ఆర్జిత సేవల టికెట్ల అమ్మకాల్లో కుంభకోణం జరిగినట్టు సమాచారం. ఈ టికెట్లను జారీ చేసే క్రమంలో బ్యాంకుల తరఫున పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. సుమారు 1.40 కోట్ల మేర అవినీతి జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన వారి నుంచి నగదు రికవరీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కర్నూలు జిల్లా ఎస్పీతో మాట్లాడి, ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక అధికారితో పాటు సైబర్ నిపుణులని నియమించాలని సూచించారు. దేవాదాయ కమిషనర్‌ను అవినీతి భాగోతంపై పూర్తి వివరాలతో పాటు అంతర్గత ఆడిట్ రిపోర్ట్ అందజేయాలని ఆదేశించారు.


Next Story

Most Viewed