- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడనుంచి వైన్‌షాపును తొలగించండి.. కమిషనర్‌కు లేఖ
<p>దిశ, శేరిలింగంపల్లి: నిత్యం జనాల రద్దీ ఎక్కువగా ఉండే వడ్డేపల్లి ఎన్‌క్లేవ్ వద్ద ఉన్నటువంటి వైన్‌షాపును అక్కడినుంచి తరలించాలని వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి బుధవారం ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వివేకానంద నగర్ డివిజన్ రామాలయం కమాన్ నుండి జగద్గిరిగుట్టకు వెళ్లే మార్గం నిత్యం రద్దీతో కూడుకొని ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళల్లో విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్తోన్న ప్రజలకు మద్యం షాపు వద్ద రద్దీ ఉండటంతో ట్రాఫిక్ […]</p>

దిశ, శేరిలింగంపల్లి: నిత్యం జనాల రద్దీ ఎక్కువగా ఉండే వడ్డేపల్లి ఎన్‌క్లేవ్ వద్ద ఉన్నటువంటి వైన్‌షాపును అక్కడినుంచి తరలించాలని వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి బుధవారం ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వివేకానంద నగర్ డివిజన్ రామాలయం కమాన్ నుండి జగద్గిరిగుట్టకు వెళ్లే మార్గం నిత్యం రద్దీతో కూడుకొని ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళల్లో విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్తోన్న ప్రజలకు మద్యం షాపు వద్ద రద్దీ ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. దీంతో వెంటనే అక్కడినుంచి వైన్‌షాపును తరలించేలా చర్యలు ప్రారంభించాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పార్కింగ్ సౌకర్యం ఉన్నచోటే వైన్‌షాపునకు అనుమతి ఇవ్వాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వడ్డేపల్లి ఎన్‌క్లేవ్ వాసులు తదితరులు పాల్గొన్నారు.






