- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా సోకిందని జర్నలిస్ట్ ఆత్మహత్య
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ బారీన పడి ప్రజలు చనిపోతుంటే.. వైరస్ సోకిందన్న కారణంతో మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి వరుస ఘటనలు భారత్‌లో వెలుగు చూస్తున్నాయి. ఇటీవల హర్యానాలో ఒకరు, హైదారాబాద్ మరొకరు వైరస్ సోకిందన కారణంతో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, తాజాగా కరోనా సోకిందని ఓ జర్నలిస్టు ప్రాణాలు తీసుకున్నాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఓ జర్నలిస్ట్ ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స పొందుతున్నాడు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ బారీన పడి ప్రజలు చనిపోతుంటే.. వైరస్ సోకిందన్న కారణంతో మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి వరుస ఘటనలు భారత్‌లో వెలుగు చూస్తున్నాయి. ఇటీవల హర్యానాలో ఒకరు, హైదారాబాద్ మరొకరు వైరస్ సోకిందన కారణంతో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, తాజాగా కరోనా సోకిందని ఓ జర్నలిస్టు ప్రాణాలు తీసుకున్నాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఓ జర్నలిస్ట్ ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స పొందుతున్నాడు. వైరస్ నుంచి మెల్లగా కోలుకుంటున్న అతడికి ఏమైందో ఏమో గానీ, ఎయిమ్స్ నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వైరస్ నుంచి కోలుకుంటున్న ఆ జర్నలిస్ట్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అని వైద్యులు అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.
Next Story






