కరోనా చేరని దేశాలివే..!

by  |
కరోనా చేరని దేశాలివే..!
X

న్యూఢిల్లీ : గతేడాది డిసెంబర్‌లో చైనాలో పురుడుపోసుకున్న కొవిడ్ 19 దాదాపు ప్రపంచాన్ని చుట్టేసింది. అడుగెట్టిన ప్రతీదేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఈ కరోనా వైరస్ విశ్వవ్యాపితమై.. విశ్వరూపం చూపుతున్నది. మానవుని శ్వాస వ్యవస్థపై దాడి చేసి మరణానికి కారణమవుతోన్న ఈ వైరస్ ఇప్పటి వరకు 185 దేశాలకు పాకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర స్వతంత్ర సంస్థలు, స్వచ్చంద సేవా సంస్థల నుంచి అందిన వివరాలను అనుసరిస్తూ అమెరికాలోని జాన్స్ హాప్కిన్ యూనివర్సిటీ ప్రతీ రోజు ఒక నివేదికను విడుదల చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాస్తంగా లక్షా 10 వేలకు పైగా కరోనా బారిన పడి మరణించగా.. 4 లక్షల 12 వేలకు పైగా బాధితులు కోలుకున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. కాగా అధికారికంగా కొన్ని దేశాల్లో అసలు కరోనా కేసులే నమోదు కాలేదని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలియజేస్తోంది.

ఆ దేశాలు ఏవనగా..

కామరోస్,
కిరిబాటి,
లెసోతో
, మార్షల్ ఐలాండ్స్
, మిక్రొనేషియా,
నౌరు,
ఉత్తర కొరియా,
పలావ్,
సమోవా
, సావ్ టోమ్ అండ్ ప్రిన్సిప్
, సాలమన్ ఐలాండ్స్
, తజికిస్తాన్,
టోంగా,
తుర్కమెనిస్తాన్,
తువాలు,
వనౌటూ. ఈ దేశాలకు ఇప్పటి వరకు ఈ మహమ్మారి ఎంటర్ కాలేదు.

Tags: coronavirus, countries, entered, free, virus

Next Story

Most Viewed