- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
COVID 19 : దేశంలో మరో రెండు కొత్త కరోనా వేరియంట్స్
భారత్ లో కరోనా(Covid 19) డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో కరోనా(Covid 19) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ కరోనా పాజిటివ్(Carona Positive) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, వెస్ట్ బెంగాల్ లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా ఒక రోజు తేడాతో ఏపీ, తెలంగాణలో కూడా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఎన్బీ 1.8.1(NB 1.8.1), ఎల్ఎఫ్.7(LF.7) లను గుర్తించినట్టు సార్స్-కోవ్ జీనోమిక్స్ కన్సార్టియం(INSACOG) శనివారం ప్రకటించింది. NB.1.8.1 వేరియంట్ ఒక కేసు తమిళనాడులో, LF.7 వేరియంట్ నాలుగు కేసులు గుజరాత్‌లో నమోదయ్యాయి.
ఈ వేరియంట్లు ఒమిక్రాన్ నుంచి పరిణామం చెందిన రకాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పేర్కొంది. కొత్త వేరియంట్లు చైనా, హాంకాంగ్, సింగాపూర్, థాయ్ లాండ్ లలో వేలల్లో కేసులు నమోదు కావడానికి కారణం అవుతున్నాయి. WHO ప్రకారం ఇవి తక్కువ ప్రమాదకరమైనవి అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇక దేశంలో ఇప్పటి వరకు 290 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకీ అన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు మొదలవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నియమాలు విడుదల చేస్తూ.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.






