- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొవిడ్ విజృంభణ.. ఆరోగ్యశాఖ అత్యవసర సమావేశం
దేశ వ్యాప్తంగా కరోనా(Covid 19) కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా(Covid 19) కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇవాళ ఒకేరోజు 23 కొవిడ్ కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. జ్వరం, జలుబు, గొంతునొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు ఉంటే తక్షణమే టెస్టులు చేయించుకోవాలని.. పాజిటివ్ నిర్ధారణ అయితే వెంటనే హోమ్ క్వారంటైన్ కావాలని ఆదేశించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 257 మంది కరోనా లక్షాణాలతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అధికంగా కేరళ రాష్ట్రంలో 95 మంది, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56 మంది, కర్ణాటకలో 13 మంది, పుదుచ్చేరిలో 10 మంది కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి ఉందని, కానీ తీవ్రమైన హాని కలిగించే అవకాశం లేదన్నారు. బహిరంగ ప్రాంతాల్లో మాస్క్ ధరించడంతో పాటు నివారణ చర్యలు పాటించాలన్నారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలని అధికారులు సూచించారు.






