మళ్లీ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి.. అప్రమత్తమైన కేంద్రం

by Disha Web Desk 2 |
మళ్లీ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి.. అప్రమత్తమైన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. ఇతర దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా కొత్త వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. పాజిటివ్ కేసులు నమోదైతే ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనాలో రోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి మరింత పెరగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, గతంలో కరోనా మహమ్మారి భారత దేశాన్ని ఎంత దెబ్బ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మహమ్మారి మూలంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఈ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్లీ ముప్పు పొంచివుందని వార్తలు విస్తృతం కావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.



Next Story

Most Viewed