కేరళను భయపెడుతోన్న కరోనా..భారీగా పెరిగిన కేసులు

by Ajay Maddhiboyina |

దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 257 కేసులు న‌మోద‌య్యాయి. అయితే ఇందులో స‌గం కంటే ఎక్కువ కేసులు కేర‌ళ రాష్ట్రంలోనే న‌మోద‌వ్వ‌డం ఆ రాష్ట్రాన్ని ఆందోళ‌న పెట్టిస్తోంది.

కేరళను భయపెడుతోన్న కరోనా..భారీగా పెరిగిన కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 257 కేసులు న‌మోద‌య్యాయి. అయితే ఇందులో స‌గం కంటే ఎక్కువ కేసులు కేర‌ళ రాష్ట్రంలోనే న‌మోద‌వ్వ‌డం ఆ రాష్ట్రాన్ని ఆందోళ‌న పెట్టిస్తోంది. కేర‌ళ‌లో ఈ ఒక్క నెల‌లోనే ఏకంగా 182 కేసులు న‌మోద‌య్యాయి. తిరువ‌నంత‌పురం, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో కోవిడ్ తీవ్ర‌త అధికంగా ఉంది.

దీంతో కేర‌ళ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు ధ‌రించాల‌ని కేర‌ళ ఆరోగ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు సూచించారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అన్నారు. మ‌రోవైపు విదేశాల్లోనూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఆగ్నేయాసియా నగరాల్లో ఒమిక్రాన్ జేఎన్1 ఉపవేరియంట్లు LF.7, NB.1.8 విస్తరిస్తున్నాయి.

Next Story