దేశంలో పెరుగుతున్న కరోనా..24గంటల్లో ముగ్గురు మృతి, కేసులు ఎన్నంటే?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-10 15:01:31  IST  )

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్ర‌స్తుతం భార‌త్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 6,815కు చేరుకుంది.

దేశంలో పెరుగుతున్న కరోనా..24గంటల్లో ముగ్గురు మృతి, కేసులు ఎన్నంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్ర‌స్తుతం భార‌త్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 6,815కు చేరుకుంది. 24 గంటల్లోనే 324 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా మహమ్మారి కారణంగా ముగ్గురు చనిపోయారు. దీంతో ఈ ఏడాది కరోనాతో మరణించిన వారి సంఖ్య 68కి చేరుకుంది. ఇక కేరళలో ఏకంగా 2,053 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొదటి నుండి కేరళలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా బారినపడినవారికి చికిత్స అందించడంతో పాటూ అధికారులను అప్రమత్తం చేసింది. కేరళ తరవాత గుజరాత్‌లో 1,109 కేసులు, బెంగాల్ 747, ఢిల్లీలో 691, మహారాష్ట్రలో 613, కర్నాటకలో 559, ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Next Story