- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇళ్లలోనే చికిత్స తీసుకుంటున్నారు..కోవిడ్ పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ప్రస్తుత

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటనలో పేర్కోంది. కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.
వైరస్ సోకినవారు ప్రస్తుతం ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారని తెలిపింది. వైరస్ బారిన పడుతున్న వారలో చాలా మంది స్వల్ప లక్షణాలతో ఇళ్లలోనే ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని వెల్లడించింది. అయినప్పటికీ ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటున్నామని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.






