- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కియాలో కరోనా కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నానాటికీ విస్తరిస్తోంది. ఏపీకే తలమానికంగా నిలిచే అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్‌ను కూడా కరోనా వదల్లేదు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కియా మోటార్స్ ఈ మధ్యే తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కియా మోటార్స్ బాడీ షాప్‌లో పని చేసే తమిళనాడుకి చెందిన ఉద్యోగికి కరోనా సోకినట్టు తేలింది. ఈ నెల 25న ఆ వ్యక్తి కంపెనీకి వచ్చినట్టు సమాచారం. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నానాటికీ విస్తరిస్తోంది. ఏపీకే తలమానికంగా నిలిచే అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్‌ను కూడా కరోనా వదల్లేదు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కియా మోటార్స్ ఈ మధ్యే తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కియా మోటార్స్ బాడీ షాప్‌లో పని చేసే తమిళనాడుకి చెందిన ఉద్యోగికి కరోనా సోకినట్టు తేలింది. ఈ నెల 25న ఆ వ్యక్తి కంపెనీకి వచ్చినట్టు సమాచారం. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతనిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రాంగణంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. దీంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. అయితే అతనితో సన్నిహితంగా ఉన్న వారందర్నీ గుర్తించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.
Next Story






