- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం క్యాంపు ఆఫీసులో కరోనా కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపుతోంది. కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది కానిస్టేబుల్స్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీ ఎస్పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన వారు సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 2న భద్రతా సిబ్బంది మొత్తానికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అయితే ఆ ఫలితాలు సోమవారం రావడంతో ఎనిమిది మందికి […]</p>

X
దిశ, అమరావతి బ్యూరో: తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కరోనా పాజిటివ్ కేసు కలకలం రేపుతోంది. కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది కానిస్టేబుల్స్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీ ఎస్పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన వారు సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 2న భద్రతా సిబ్బంది మొత్తానికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అయితే ఆ ఫలితాలు సోమవారం రావడంతో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై వారిని క్వారంటైన్ కు తరలించారు.
Next Story






